సైకిల్ ఎక్కి మరీ దొంగతో పాటు వెళ్ళాము
చాన్నాళ్ళ క్రితం మా ఊర్లో పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇద్దరు చిన్నపిల్లలు రోడ్డు మీద వెళ్తున్నారు.
ఆ ఇద్దరూ చక్కగా రెండు జడలు వేసుకొని, ఒకరి చేయు ఒకరు పట్టుకొని ఆడుతూ,పడుతూ ..స్కూల్ బాగ్ తగిలించుకుని వెళ్తున్నారు.
అంటే మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేసి...దగ్గరే ఉన్న బడికి వెళ్తున్నారు.
ఆ ఇద్దరు పిల్లలకి సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి ఎదురయ్యాడు.
10 అడుగుల దూరంలో ఉన్న బడి వైపు చూపిస్తూ.. పాపా.... మీరు చదివేది ఆ బడిలోనే కదా..! అన్నాడు.
చిన్నపిల్లలు కదా... అమాయకంగా 'అవును అంకుల్' అని సమాధానం ఇచ్చారు.మీరు ఉండేది ఆ వీధిలోనే కదా... అని వాళ్ళు ఉండే వీధి వైపు చూపించాడు.అబ్బో ... ఈ అంకుల్ కి మనం బాగా తెలుసనుకుంటా చెల్లి... అనిఅవునంకుల్ మీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది పెద్ద పాపా.
మీ నాన్న నాకు బాగా తెలుసమ్మా....!! అన్నాడు ఆ వ్యక్తి.ఓహో... మా నాన్న కూడా మీకు తెలుసా...!! బలే బలే..అనుకున్నారు అక్క చెల్లెళ్ళు మొహమాహాలు చూసుకుంటూ.ఎంటమ్మ ఇంత ఎండాల్టప్పుడు ఇలా నడుచుకుంటూ వేల్తున్నరేంటి ...!!రండి నేను నా సైకిల్ మీద దిగబెడతా అన్నాడు.పర్లేదు అంకుల్...! బడి దగ్గరేగా ... మేం వెళ్తాంలే అన్నారు ముద్దుగా....!!మరేం పర్లేదు పాపా...మా టైలర్ షాప్ ఈ పక్కనే మీ నాన్న కొత్త బట్టలు కుట్టమని నాకు ఇచ్చాడు.బట్టలు కుట్టడం అయిపోయుంది. అవి మీకు ఇస్తాను.
మీ నాన్నకి ఇస్తారా? అన్నాడు.పాపం.... నాన్నకి బట్టలు చాల తక్కువ ఉన్నాయు కదా చెల్లి.అవును అక్కా....!! పండగ వస్తుంది కదా.... కొత్త బట్టలు తీసుకున్నడేమో.
సరే అంకుల్ ఇచ్చేయండి, తీసుకేల్తాం అన్నారు అమాయకంగా.
అరె...మీరు కనిపిస్తారని నాకు తెలియదు కదమ్మా....!!
అందుకే నేను తీసుకురాలేదు.
ఒక పని చేద్దామా... మా షాప్ ఈ పక్కనే, మనం నేరుగా షాప్ కి వెళ్దాం.
అక్కడ మీ నాన్న బట్టలు ఇచ్చేస్తాను. మీరు అవి తీసుకొని స్కూల్ కి వెళ్ళండి.
ఇంటికి వెళ్ళాక నాన్నకి కొత్త బట్టలు ఇచ్చేయండి.
మా పిల్లలు నేను వెళ్ళకుండానే నా బట్టలు తెచ్చేసారని మీ నాన్న చాల సంతోషిస్తారు అన్నాడు.అవునా అంకుల్... మా నాన్న అంటే మాకు చాల ఇష్టం.
నాన్న సంతోషిస్తారంటే తీసుకేల్తాం పద...అక్క....!! అని ఇద్దరు సైకిల్ ముందు ఒకరు, వెనకాల వొకరు ఎక్కారు.
ఆ వ్యక్తి ఇద్దరు పిల్లల్ని సైకిల్ మీద తీసుకొని వెళ్తూ ఉన్నాడు.
పిల్లలతో కబుర్లు చెప్తూ ముందు కూర్చున్న పాపతో ఇలా అన్నాడు.
అరె... పాపా నీ చెవి రింగులు భలే ఉన్నాయే...!!బాగున్నాయా అంకుల్??
మా అక్కకి కూడా ఇలాంటివే ఉన్నాయు.
అన్నది ఆ చిన్న పాపా మురిసిపోతూ...!!
కాని ఇలాంటి పిచ్చి రింగులు పెట్టుకుంటే చెవి నొప్పి వస్తుంది కదమ్మా అన్నాడు.
అయ్యో...కాదంకుల్ ఇవి బంగారమే....!!పోయున వారమే మా నాన్న ఇద్దరికీ ఈ బంగారు చెవి రింగులు చేపించారు.
అది విన్న ఆ వ్యక్తి సడన్ గా సైకిల్ ఆపేసాడు.అయ్యయో... ఇంత చిన్న పిల్లలు... బంగారం పెట్టుకొని ఇలా బయట తిరిగితే ఎలాగమ్మా??దొంగలు ఉంటారు.
ఈ బంగారం కోసం మిమ్మల్ని ఏమైనా చేస్తే... ?
అని భయపెట్టాడు.ఇంకేముందు చిన్న పిల్లలు కదా భయపడిపోయారు.
మరి ఇప్పుడు ఏం చేయాలి అంకుల్ అని బేలగా అడిగారు.మరేం భయం లేదు పాపా...ఈ చెవి కమ్మలు నేను తీసి జాగ్రత్త గా పేపర్ లో చుట్టి ఇస్తాను.
అవి జాగ్రత్త గా మీ బాగ్ లో పెట్టుకోండి.
ఇంటికి వెళ్ళాక అమ్మకి ఇచ్చేయండి.అప్పుడు మీ అమ్మ కూడా మా పిల్లలకి ఎంత జగ్రత్తో కదా అనిమిమ్మల్ని మెచ్చుకుంటుంది.
సరే అంకుల్ అలాగే చేద్దాం అని ఇద్దరు పిల్లలు చెవి రింగులు ఆ వ్యక్తికి ఇచ్చి పేపర్ లో కట్టించారు.
ఆ పొట్లం జాగ్రత్తగా పిల్లల బాగ్ లో పెట్టాడు ఆ వ్యక్తి.
అరెరే బడి కి టైం అవుతుంది కదమ్మా....ముందు మీరు బదికేల్లండి.
లేట్ అయితే టీచర్ కొడుతుంది. నేను వెళ్ళి బట్టలు తెచ్చి మీ స్కూల్ ల్లో ఇచేస్తాను అన్నాడు ఆ పిల్లలు అమాయకంగా తల ఊపి బడి బాట పట్టారు.బయటే నిల్చుని చూస్తున్న స్కూల్ ప్రిన్సిపాల్....ఇదేంటి మీ ఇల్లు అటు కదా...ఇటు నుండి వస్తున్నారేంటి అని అడిగింది వేమన పద్యం అప్పజేప్పినట్టు జరిగింది మొత్తం చెప్పారు. విషయం పెద్ద పంతులమ్మ ఆ పిల్లల ఇంటికి కబురంపింది.ఇంకేముంది బాగ్ లో ఉన్న పొట్లం ఊదా తీసి తల పైకి ఎత్తి చూసేసరికి సగం ఊరు అంత గుమి గూడింది.అమ్మో దొంగ వేదవ చిన్న పిల్లల చెవి పోగులు కాజేసాడు....
ఆడి జిమ్మదిపోను.
ఇంకా నయం పిల్లల్ని ఎత్తుకుపోలేదు.... సంతోషం అని తలా ఒక మాట అంటుంటే గాని
ఆ అక్కచేల్లెల్లకి అర్ధం కాలేదు...వచ్చినోడు ...దొంగా... అని....
ఫాఫం....చిన్న పిల్లలు కదూ ఏం చేస్తారు...
బిక్క మొహం వేసుకొని అమ్మ నాన్నల వైపు చూస్తూ ఏడుపు అందుకున్నారు.
ఆ సైకిలేసుకొచ్చిన సచ్చినోడు... ఎలా ఉంటాడమ్మ అని ఓ పెద్దావిడ ఆరా తీసుతుంటే...
ఆ అంకులుకి గడ్డం మీసాలు ఉన్నాయు.
పాపం....అన్నం తినడేమో... సన్నగా ఉన్నాడు.
అంటూ దొంగోడి మీద కూడా జాలి చూపిస్తున్న కూతుళ్ళు చెప్పిన సమాదానలకి నవ్వాలో... అరవాలో తెలియక మౌనంగా ఉన్నారు ఆ పిల్లల అమ్మా నాన్నలు.
పొలిసు కంప్లైంటు ఇవ్వండని సలహా ఇచ్చిన వాళ్ళకి వచ్చినోడు.... చిన్నమెత్తు బంగారమె ఎత్తుకెళ్ళాడు.బంగారాల్లాంటి నా బిడ్డలు క్షేమంగా ఉన్నరనుకుంటూ మౌనంగా ఇంటి దారిన పట్టాడు ఆ తండ్రి.
రోజు కూలిగా బ్రతికే ఓ సామాన్య వ్యక్తి రూపాయు రూపాయు కూడేసి ముచ్చటగా పిల్లలకి పెట్టిన ఆ చిన్నమెత్తు బంగారం మీద కన్నేసిన దొంగోడు.....ఎన్ని కోట్లు కూడేసాడో.... తెలియదుగాని
ఆ సంఘటనతో ఆ ఇంట్లో జాగ్రత్త పెరిగింది.
మళ్ళి ఆ పిల్లల వొంటి మీదికి బంగారం రావడానికి చాల కాలమే పట్టింది.
ఆ దొంగోడి సైకిలు కడ్డిపై ముందు కూర్చున్న ఆ చిన్న పిల్ల మాత్రం.....
ఆ దొంగ మీకు ఎవరికైనా కనిపిస్తే నాకు తెలియజేయండి అంటూ
20 ఏళ్ల తర్వాత జరిగిందంతా చెప్తూ పేస్ బుక్కు లో దొంగోడిని వెతకడం మొదలెట్టింది.
అన్నట్టు ఆ చిన్న పిల్ల పేరు...
Comments
Post a Comment