Posts

Showing posts from September, 1997

సైకిల్ ఎక్కి మరీ దొంగతో పాటు వెళ్ళాము

  చాన్నాళ్ళ క్రితం మా ఊర్లో పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇద్దరు చిన్నపిల్లలు రోడ్డు మీద వెళ్తున్నారు. ఆ ఇద్దరూ చక్కగా రెండు జడలు వేసుకొని, ఒకరి చేయు ఒకరు పట్టుకొని ఆడుతూ,పడుతూ ..స్కూల్ బాగ్ తగిలించుకుని వెళ్తున్నారు. అంటే మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేసి...దగ్గరే ఉన్న బడికి వెళ్తున్నారు. ఆ ఇద్దరు పిల్లలకి సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి ఎదురయ్యాడు. 10 అడుగుల దూరంలో ఉన్న బడి వైపు చూపిస్తూ.. పాపా.... మీరు చదివేది ఆ బడిలోనే కదా..! అన్నాడు. చిన్నపిల్లలు కదా... అమాయకంగా 'అవును అంకుల్' అని సమాధానం ఇచ్చారు.మీరు ఉండేది ఆ వీధిలోనే కదా... అని వాళ్ళు ఉండే వీధి వైపు చూపించాడు.అబ్బో ... ఈ అంకుల్ కి మనం బాగా తెలుసనుకుంటా చెల్లి... అనిఅవునంకుల్ మీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది పెద్ద పాపా. మీ నాన్న నాకు బాగా తెలుసమ్మా....!! అన్నాడు ఆ వ్యక్తి.ఓహో... మా నాన్న కూడా మీకు తెలుసా...!! బలే బలే..అనుకున్నారు అక్క చెల్లెళ్ళు మొహమాహాలు చూసుకుంటూ.ఎంటమ్మ ఇంత ఎండాల్టప్పుడు ఇలా నడుచుకుంటూ వేల్తున్నరేంటి ...!!రండి నేను నా సైకిల్ మీద దిగబెడతా అన్నాడు.పర్లేదు అంకుల్...! బడి దగ్గరేగా ... మేం వెళ్తాంలే అన్నారు ...